పేదల పక్షపాతి వీఎం రంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
పట్నంబజారు: పేద పక్షపాతిగా తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు వంగవీటి మోహనరంగా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీర్తించారు. గురువారం వంగవీటి మోహనరంగా వర్ధంతిని పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పెత్తందారుల గుండెల్లో సింహ స్వప్నమై.. బలహీన వర్గాల అభ్యున్నతికి తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని ధీరుడు మోహనరంగా అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవింతాంతం పాటుపడ్డారన్నారు. నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజల కోసమే పాటుపడిన మహనీయుడు వంగవీటి అని కీర్తించారు. చరిత్రలో ఆయనకున్న పేరును, ప్రజల మనస్సుల్లో ఉన్న గొప్ప స్థానాన్ని ఎవ్వరూ చెరపలేరన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్పొరేటర్‌లు మామిడి రాము, ముంతాజ్, బత్తుల దేవా, నూనె ఉమామహేశ్వరరెడ్డి, ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, మార్కెట్‌బాబు, గేదెల రమేష్, జీకే, బూసి రాజలత, సైదాఖాన్, వంగల వలీవీరారెడ్డి, రెడ్డి కోటేశ్వరరావు, సత్యవతి, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment