నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ఫ్లోర్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 31 వరకు గుంటూరురోడ్డు కే–రిడ్జి పాఠశాలలో 18వ జాతీయస్థాయి అండర్–17, అండర్–12 బాల బాలికల ఫ్లోర్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల ఛైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.జె.జోసఫ్ తెలిపారు. పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇండియన్ ఫ్లోర్ బాల్ ఫెడరేషన్ (ఐఎన్‌ఎఫ్‌ఎఫ్) మార్గదర్శకంలో ఈపోటీలను నిర్వహించటంతో పాటు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే జట్టు ఎంపిక నిర్వహించనున్నట్టు వివరించారు. దేశ వ్యాప్తంగా 17 జట్లు పోటీలో పాల్గొనేందుకు వస్తున్నట్టు తెలిపారు. పోటీలను లీగ్ కమ్ నాకౌట్ పద్దతిలో నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 350మంది క్రీడాకారులు, అఫీషియల్స్ పోటీలకు హాజరవుతారని తెలిపారు. పోటీల నుంచి ఎంపిక చేసిన జట్టు మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లోర్ బాల్ టోర్నమెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు. కాగా ఇప్పటికే హర్యానలో నిర్వహించిన పోటీలో పురుషులు, మహిళల సీనియర్ జట్టును ఎంపిక చేశారని తెలిపారు. సీనియర్ జట్టుకు తమ పాఠశాల క్రీడామైదానంలోనే ఐదు రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
15 రాష్ట్రాల నుంచి 350 మంది క్రీడాకారులు రాక సీనియర్ జాతీయ జట్లకు కే–రిడ్జిలో క్యాంప్
Comments
Please login to add a commentAdd a comment