క్రెడాయ్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ
నగరంపాలెం: క్రెడాయ్ గుంటూరు చాప్టర్ 2025 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ, క్రెడాయ్ సర్వసభ్య సమావేశం బుధవారం ఇన్నర్‌రింగ్ రోడ్డులోని శ్రీకన్వెన్షన్‌లో నిర్వహించారు. గుంటూరు చాప్టర్ అధ్యక్షుడు మామిడి రాము అధ్యక్షత వహించారు. క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి, గుంటూరు చైర్మన్ ఆరుమళ్ల సతీష్‌రెడ్డి, అధ్యక్షుడు మామిడి రాము, కార్యదర్శి మెట్టు సాంబశివారెడ్డి, ఉపాధ్యక్షులు టి.వినోద్‌రెడ్డి, వి.శివనాగేశ్వరరావు నూతన డైరీని ఆవిష్కరించారు. క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శివారెడ్డి మాట్లాడుతూ ఏటా ఆవిష్కరిస్తున్న డైరీలో పలు జీవోలు ఉంటాయని చెప్పారు. నూతన సంవత్సరంలో ప్రభుత్వం బిల్డింగ్స్ రూల్స్‌కు సంబంధించి కొత్త జీవో యివ్వనుందని పేర్కొన్నారు. పాత జీవోలపై కూడా చర్చించామని, రానున్న కొత్త జీవో బిల్డర్స్‌కు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. బిల్డర్స్ అందరూ ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం భవనాలు నిర్మించాలని చెప్పారు. గుంటూరు చైర్మన్ ఆరుమళ్ల సతీష్‌రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా క్రెడాయ్ డైరీ ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. అధ్యక్షుడు మామిడి రాము మాట్లాడుతూ క్రెడాయ్ సభ్యులంతా నేషనల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ ప్రకారం భవనాలు నిర్మించాలని సూచించారుకార్యక్రమంలో మాజేటి ప్రసాద్, ఎం.బసివిరెడ్డి, కె.కమలాకర్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment