27న మాస్టర్ మైండ్స్ జాబ్ మేళా
గుంటూరు ఎడ్యుకేషన్: మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాస్టర్‌మైండ్స్‌లో ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, క్యాంపస్ ఇన్‌చార్జ్‌లు, క్లాస్ ఇన్‌చార్జ్‌లు, హాస్టల్ స్టాఫ్, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డీటీపీ ఆపరేటర్లు, కంప్యూటర్ హార్డ్‌వేర్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ సూపర్‌వైజర్లు, డ్రైవర్ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్హతలు కలవారు అర్హులన్నారు. 21– 45 ఏళ్ల లోపు వయసు కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. వేతనం రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల వారికి భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల వారు శుక్రవారం ఉదయం 10 గంటలకు బ్రాడీపేట 3/9లోని మాస్టర్ మైండ్స్ పుష్ప భవన్‌కు రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 89784 80429 /30 /35, 91000 24059 ఫోను నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
వాసవి సేవా సమితి సమాఖ్య చీఫ్ ఆర్గనైజర్‌గా పెనుగొండ
గురజాల: పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమాఖ్య చీఫ్ ఆర్గనైజర్‌గా పెనుగొండ అమృతలింగేశ్వరరావును నియమిస్తూ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు గరిణె పుల్లారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పెనుగొండ అమృతలింగేశ్వరరావు మాట్లాడుతూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాచర్ల మునిసిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు పాల్గొన్నారు.
మద్యం దుకాణంలో ఘర్షణ
ముప్పాళ్ల: స్థానిక మద్యం దుకాణంలో టేబుల్ వద్ద కుర్చీ విషయంలో ఇరువురి మధ్య వాదన ముదిరి జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం.. గుంటూరు బ్రాంచి కాలువ పక్కనే ఉన్న ఓ వైన్స్‌లో గనికపూడి శేషు, షేక్ మస్తాన్‌వలి(కుంటిమద్ది) మద్యం తాగుతున్నారు. నరసరావుపేట మండలం ములకలూరుకు చెందిన చింత మెహర్‌బాబు, బొమ్మిశెట్టి వాసు, పి.కాళిదాసు, ఎ.కాళీలతో పాటుగా మరికొంత మంది మద్యం తాగేందుకు వచ్చారు. పక్కనే ఉన్న కుర్చీలు తీసుకుంటుండగా శేషు, మస్తాన్‌వలి తమ వాళ్లు వస్తారని, వేరే టేబుల్ వద్దకు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మద్య వాదనలు ముదిరి ఘర్షణ పడ్డారు. మస్తాన్‌వలి పై ములకలూరుకు చెందిన వారు కుర్చితో దాడి చేయటంతో పక్కనే ఉన్న ముస్లిం యువకులు ములకలూరుకు చెందిన వారిపై ఎదురు దాడికి దిగారు. ఈ దాడిలో ములకలూరుకు చెందిన వారు బీరు బాటిల్ పగలకొట్టి శేషు తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment