మన్మోహన్‌తో యలమంచిలి అనుబంధం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దేశ మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి శుక్రవారం రాజ్యసభ మాజీ సభ్యులు, డాక్టర్ యలమంచిలి శివాజీ ఢిల్లీ వెళ్లారు. మన్మోహన్ సింగ్‌తోపాటు శివాజీ రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. అప్పట్లో రాజ్యసభలో ఇద్దరూ పక్కపక్క సీట్లలో కూర్చునేవారు. దీంతో మన్మోహన్ సింగ్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఆయనకు ఆప్తమిత్రుడిగా శివాజీ కొనసాగుతూ వచ్చారు. వాజ్‌పేయ్ ప్రధానిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మూడుసార్లు జరిగిన సెమినార్లలో మన్మోహన్ సింగ్ పాల్గొ న్నారు. అప్పట్లో మూడుసార్లు గుంటూరులోని యలమంచిలి శివాజీ ఇంటిలోనే మన్మోహన్ సింగ్ బస చేశారు. మన్మోహన్ మరణంతో యలమంచిలి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. శివాజీతోపాటు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ కూడా ఢిల్లీ వెళ్లారు.
రాజ్యసభలో పరిచయంతో స్నేహం సెమినార్లకు వచ్చినప్పుడు శివాజీ ఇంట్లోనే సింగ్ బస ఆప్తమిత్రుడి అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లిన యలమంచిలి
Comments
Please login to add a commentAdd a comment