● అర్హత సాధించిన అభ్యర్థులు 9,084 మంది ● పురుషులు 7,483
పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తాం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌ఆర్‌బీ) చేపట్టిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ పరీక్ష (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ పరీక్షలు (పీఈటీ) పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 30 నుంచి వచ్చేనెల 22 వరకు జరపనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు కేటాయించిన నిర్ణీత వేళలు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటలులోపు గ్రౌండ్‌కు రావాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 9,084 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించగా, అందులో 7,483 మంది పురుషులు, 1,601 మంది సీ్త్రలు ఉన్నారని వివరించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్ ఆథెంటిఫికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు(ఛాతీ, ఎత్తు కొలత), ఫిజికల్ ఎఫీషియన్సీ పరీక్షలు (1,600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్), వెరిఫికేషన్ – 2 (స్పెషల్ బెన్ఫిట్స్ – లోకల్ స్టేటస్), రిజల్ట్ కౌంటర్ వరకు ప్రతి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అంబులెన్స్, వైద్యులను అందుబాటులో ఉంచనున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment