సామూహిక లక్ష్మీనారాయణ కుంకుమ పూజ
తెనాలి: శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి మంగళ శాసనాలతో ఇక్కడ జరుగుతున్న శ్రీధనుర్మాస వ్రత ప్రయుక్త దీక్షా మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీనారాయణ కుంకుమ పూజను నిర్వహించారు. మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీఅష్టాక్షరీ జీయర్‌స్వామి మాట్లాడుతూ మానవజన్మ అత్యున్నతమైనదని చెప్పారు. ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి గోదాదేవి వ్రతం విశిష్టమైనదని చెప్పారు. శ్రీశరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనరేంద్రరామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆర్టీసీ బస్‌స్టేషను–వీఎస్సార్ కాలేజి రోడ్డులో ఈ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. పూజల అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment