ఉరుకులెత్తిన ఉత్సాహం
పోల్‌వాల్ట్ దూకుతున్న శ్రీనివాసులురెడ్డి (60 సంవత్సరాలు, బాపట్ల)
గుంటూరు వెస్ట్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఆరోఏపీ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్– 2024 పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గళ్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడా సాధనకు వయస్సుతో సంబంధం లేదని తెలిపారు. ఎనిమిది పదుల వస్సులోనూ పోటీల్లో పాల్గొనడం నిజంగా గొప్పదనమని కొనియాడారు. అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజూ వ్యాయామం, యోగా, క్రీడా సాధన గానీ చేయాలని సూచించారు. ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ లాల్ వజీర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 మంది సీ్త్ర, పురుష వెటరన్ అథ్లెటిక్స్ వివిధ విభాగాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఆదివారంతో ఈ పోటీలు ముగుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్, జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment