న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చర్యలకు డిమాండ్
నగరంపాలెం: పొన్నూరులో న్యాయవాది ప్రకాశరావుపై పోలీసులు జరిపిన దాడిని సహచర న్యాయవాదులు ముక్తకంఠంతో ఖండించారు. ప్లకార్డులు చేతపట్టుకుని రోడ్డెక్కారు. దాడికి పాల్పడిన ఇద్దరు పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ది గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టులోని బార్ హాల్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) వద్దకు చేరుకున్నారు. ప్రధాన రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. న్యాయవాదులకు రక్షణ చట్టాలు తేవాలని, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. నగరంపాలెం పీఎస్ పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పడంతో లోనికెళ్లారు. అనంతరం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజోన్నల బ్రహ్మారెడ్డి, ఉపాధ్యక్షుడు గౌరీశంకర్, మాజీ అధ్యక్షుడు శాంతకుమార్, పొన్నూరు సీనియర్ న్యాయవాది జి.ఎస్.రాయల్, జయరాజ్, నాగేశ్వరరావు, ఎన్.వర్ధన్‌రావు, షేక్. కరిముల్లా, క్రాంతి, రాజారావు నారాదాసు వీరమణి, షేక్. జిలానీ, న్యాయవాదులు పాల్గొన్నారు.
ప్లకార్డులతో గుంటూరు నగరంలో
ర్యాలీ, నిరసన ప్రదర్శన
జిల్లా ఎస్పీకి వినతిపత్రం
అందించిన బార్, న్యాయవాదులు
Comments
Please login to add a commentAdd a comment