యాజమాన్యాలకు మళ్లీ నోటీసులు ఇస్తాం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ‘‘కూటమి లక్ష్యం... ఎయి‘డెడ్’!’’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక స్పందించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 14 ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రవేశాలు పెంచుకోకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. గతేడాది విద్యార్థుల సంఖ్య 20 కంటే తక్కువగా ఉండి, ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ ఆ సంఖ్య మెరుగుపరచుకోని పాఠశాలలకు రెండోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు రంగంతో పోటీ పడలేని ఎయిడెడ్ పాఠశాలల సిబ్బంది, ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు సంబంధించిన విధానం ఇప్పటికీ అమల్లో ఉన్నట్లు తెలిపారు.
పాత విధానంలో
మార్పు లేదన్న డీఈవో
‘‘కూటమి లక్ష్యం.. ఎయి‘డెడ్’!’’
కథనానికి స్పందన
Comments
Please login to add a commentAdd a comment