లోక రక్షకుడు క్రీస్తు
ఫిరంగిపురం: లోక రక్షకుడు ఏసు క్రీస్తు అని గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిన భాగ్యయ్య అన్నారు. మండల కేంద్రంలోని బాల ఏసు దేవాలయంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రీస్తు జయంతి మహోత్సవ జాగరణ దివ్యపూజాబలిని మంగళవారం అర్ధరాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాక్యోపదేశం చేస్తూ క్రీస్తు భూమిపై పాపుల రక్షణ కోసం తన జీవితాన్ని అర్పించారని తెలిపారు. క్రీస్తు జన్మించారనేందుకు గుర్తుగా శాంతి పావురాన్ని ఎగుర వేశారు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బుధవారం నిర్వహించిన ప్రత్యేక దివ్యపూజాబలిలో పాల్గొన్నారు. విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి, ఫాదర్ టి. డోమినిక్ పాల్గొన్నారు. ఫాదర్‌లు ఉప్పులూరి రవీంద్ర, విలియమ్, బడుగు ప్రవీణ్‌కుమార్‌లు పాల్గొన్నారు. సాయంత్రం గ్రామంలో తేర్లలో మరియ మాత స్వరూపాలను ఊరేగించారు. సీఐ రవీంద్రబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment