చేనేతలు రాజకీయంగా బలపడాలి
మంగళగిరి (తాడేపల్లి రూరల్): రాజకీయంగా బలపడడానికి చేనేత వర్గాలవారందరూ కలసికట్టుగా ముందుకు రావాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ (ఏఐడబ్ల్యూఎఫ్) జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళగిరి నగర పరిధిలోని ఆర్‌ఆర్ కన్వెన్షన్‌లో శనివారం ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రథమ నూతన సంవత్సర క్యాలెండర్‌ను చేనేత నేతల సమక్షంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ చేనేత నాయకులందరితో కలసి ఫిబ్రవరి 2న గన్నవరంలో చేనేత ప్రముఖలతో సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ 18 ఉప కులాలుగా విభజించడం సరికాదని, చిన్న కులాలన్నింటిని కలుపుకుని చేనేత కులం ఒక్కటిగా ఏర్పడాలని కోరారు. ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిరాల సరళాదేవి, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొన్నారు.
ఏఐడబ్ల్యూఎఫ్ జాతీయ అధ్యక్షులు బండారు
Comments
Please login to add a commentAdd a comment