గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Published Sun, Jan 12 2025 2:35 AM | Last Updated on Sun, Jan 12 2025 2:35 AM

గుంటూ

గుంటూరు

ఆదివారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2025

అత్తోట గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం

మంత్రి మనోహర్‌

అత్తోట(కొల్లిపర): రానున్న రోజుల్లో అత్తోటను ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆహార పౌరసరఫరాలఽశాఖామాత్యులు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మండలంలోని అత్తోట గ్రామంలో శనివారం ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన మినీ గోకులం షెడ్డును జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో అర్హత ఉన్న ప్రతి రైతూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. మినీ గోకులం షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.85 లక్షలు అందిస్తుందని చెప్పారు. దీనిలో లబ్ధిదారులు కేవలం రూ.18వేలు పెట్టాలని, మిగిలిన రూ.1.67లక్షలను ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న దానికింటే అదనంగా ఇంకా రూ.50వేలు చేతికి పడుతున్నాయని నిర్మాణదారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే స్పందించిన మంత్రి ఈ విషయాన్ని త్వరలోనే ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిధులు పెంచేలా కృషి చేస్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో మినీ గోకులం షెడ్ల నిర్మాణం పథకం ద్వారా 386 మందికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికి 170 మంది నిర్మాణాలు పూర్తి చేశారని, మిగిలిన వారు కూడా నిర్మించుకోవడానికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు యర్రు వెంకయ్యనాయుడు, అడపా నారాయణరెడ్డి , డ్వామా పీడీ శంకర్‌, డీపీవో సాయికుమార్‌, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి నరసింహరావు, తెనాలి పశుసంవర్ధక శాఖ డీడీ వై.పద్మావతి పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ మినహాయిస్తే క్రిస్మస్‌ నుంచి న్యూఇయర్‌ నుంచి సంక్రాంతి వరకూ నెలరోజులు వ్యాపారాలు పెద్దఎత్తున జరుగుతాయి. అయితే, ఈ ఏడాది పెద్దగా ఆదరణ లేదని వ్యాపారులు చెబుతున్నారు. ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కిరాణా వ్యాపారాలు డల్‌

సంక్రాంతికి పిండి వంటలు పెద్దఎత్తున చేస్తారు. దీంతో కిరాణా వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి. వస్త్ర వ్యాపారాలు, కిరాణ షాపులు, బంగారం షాపులతో పాటు ఫ్యాన్సీ, ఫుట్‌వేర్‌, పెయింట్స్‌, స్వీట్స్‌ షాపులన్నీ రద్దీగా ఉండేవి. అందుకు తగ్గట్టుగానే వ్యాపారులు క్రిస్మస్‌కు ముందే కావాల్సిన సరుకులు, మెటీరియల్స్‌ కొనుగోలు చేస్తుంటారు. అప్పులు చేసి అయినా పెద్దఎత్తున స్టాక్‌ తీసుకువస్తారు. ఒక్క గుంటూరు నగరంలోనే రూ. 150 కోట్ల రూపాయల వరకూ వ్యాపారం జరుగుతుంది. అయితే, ఈసారి వ్యాపారాలు రూ. 100 కోట్లు కూడా దాటేపరిస్థితి లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. పండుగ ముందు రోజుల్లో కూడా షాపులు ఖాళీగా ఉండటం గతంలో ఎప్పుడూ చూడలేదని వారు చెబుతున్నారు. పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ మినహా చిన్న షాపులన్నీ వ్యాపారాలు లేక ఖాళీగా ఉన్నాయి. మార్కెట్‌లో డబ్బులు రొటేషన్‌ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉందని వ్యాపారస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల జేబుల్లో డబ్బులు ఉండకపోవడంతో కొత్తగా కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోతోంది. దీని ప్రభావం వ్యాపార రంగంపై తీవ్రంగా పడింది. ఒక రంగం అంటూ లేకుండా అన్ని రంగాలపై ఈ ప్రభావం పడింది. గత ఏడాది కంటే ఈ ఏడాది తమ వ్యాపారాలు భారీగా పడిపోయాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో జోరుగా వ్యాపారం

గత ప్రభుత్వ హయాంలో సంక్షేమంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు ఉండటం వల్ల వ్యాపారాలు బాగా నడిచాయని వారు చెబుతున్నారు. ఈ ఏడాది రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఒకవైపు వర్షాలు, తుఫాన్లు దెబ్బతీస్తే మరోవైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం సమస్యగా మారింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలం అయ్యింది. కేవలం 22 వేల టన్నులు మాత్రమే కొని మమ అనిపించింది. బయట మార్కెట్‌లో ధాన్యం బస్తాకు 13 వందల రూపాయలు కూడా రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి, ఇతర పంటలు వేసిన రైతుల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. దీంతో రైతుల వద్ద డబ్బులు లేకపోవడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది.

పథకాలతో చేతిలో డబ్బుల గలగలలు

గత ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం సంక్షేమ పథకాల డబ్బులు ప్రజల ఖాతాలలో ఠంచన్‌గా పడేవి. రైతాంగంలో పాటు పేద మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బులు ఉండటంతో వ్యాపారాలు బాగా సాగేవి. మార్కెట్లు కళకళలాడేవి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఈ పథకాలతో ప్రజలకు నేరుగా వారి ఖాతాలోనే నగదు చేరేది. వాటిని ఆయా లక్ష్యం మేరకు వినియోగించుకుంటూ ఆర్థికంగా ఎదిగేవారు. సొమ్మును పొదుపు చేసుకొని, పండగ వేళ కావాల్సినవి కొనుగోలు చేసుకునేవారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, చేదోడు, విద్యా దీవెన, వసతి దీవెన, ఇన్‌పుట్స్‌ సబ్సిడీ, రైతు భరోసా, వడ్డీ మాఫీ, ఆసరా, వాహనమిత్ర పథకాలతో పాటు వివిధ రంగాలు అభివృద్ది పథంలోకి వచ్చేందుకు దోహదం జరిగింది. అయితే, కొత్తగా ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పింఛన్లు ఇవ్వడం తప్పా మరే సంక్షేమ పథకం అమలు చేయడం లేదు. పింఛన్ల డబ్బులు మందులకే సరిపోతుంటాయి. దీంతో వారు ఆ డబ్బులతో ఇతరత్రా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసు ఎత్తడం లేదు. దీంతో వ్యాపారాలు సగానికి పడిపోయాయి.

7

న్యూస్‌రీల్‌

ప్రజల దగ్గర డబ్బుల్లేవు మార్కెట్‌లో వ్యాపారాలు లేవు ఆర్థిక ఇబ్బందుల్లో పేద, మధ్యతరగతి వర్గాలు గిట్టుబాటు ధర లేక, కొనేవాళ్లు లేక నష్టాల్లో రైతులు గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు రద్దు ఆర్థికంగా చేయూత ఇవ్వని కూటమి సర్కార్‌ కొనుగోళ్లు పడిపోవడంతో చితికిపోతున్న వ్యాపారులు

వ్యాపారం ఆశాజనకంగా లేదు

ఈ ఏడాది సంక్రాంతి పండుగ హడావుడి పెద్దగా కనిపించడంలేదు. ప్రధానంగా దుస్తులు, బెల్లం, ఆయిల్‌, సుగంధ ద్రవ్యాలు విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. ఈసారి సుమారు రూ.150 కోట్ల వ్యాపారం జరుగుతుందనేది ఒక అంచనా. అయితే, ధరలు ఎక్కువగా ఉండటంతో ఈదఫా ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు. గతంలో రూ.100 కోట్ల వ్యాపారం ఉన్నప్పటికీ దుకాణాలు కళకళలాడేవి.

– ఆతుకూరి ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
గుంటూరు1
1/9

గుంటూరు

గుంటూరు2
2/9

గుంటూరు

గుంటూరు3
3/9

గుంటూరు

గుంటూరు4
4/9

గుంటూరు

గుంటూరు5
5/9

గుంటూరు

గుంటూరు6
6/9

గుంటూరు

గుంటూరు7
7/9

గుంటూరు

గుంటూరు8
8/9

గుంటూరు

గుంటూరు9
9/9

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement