సీఏ విద్యార్థి ఆత్మహత్య
లక్ష్మీపురం: హాస్టల్‌లో సీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అరండల్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన ప్రభాకర్‌రాజు ఉపాధ్యాయుడు. ఆయన కుమారుడు కె.నాగప్రసాద్ (27) బ్రాడీపేటలోని లోటస్ ప్రైమ్ బాయ్స్ హస్టల్‌లో ఉంటున్నాడు. సీఏ చేస్తున్నాడు. శనివారం రాత్రి 9 గంటలకు నాగప్రసాద్‌తో రూమ్‌లో ఉండే మరో విద్యార్థి వచ్చి గది తలుపులు వేసి ఉండటంతో పిలిచాడు. అతడు పలకలేదు. దీంతో స్నేహితుడి రూమ్‌కు వెళ్లాడు. మరునాడు మధ్యాహ్నం అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులకు తెలియజేశాడు. వారు వచ్చి చూసేసరికి నాగప్రసాద్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైలు ఎక్కుతూ కిందపడి
వ్యక్తి మృతి
రెంటచింతల: స్థానిక రైల్వేస్టేషన్లో రైలు ఎక్కుతూ ఓ వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం జరిగింది. మండలంలోని పాత పాలువాయి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఏడుకొండలు(46) ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. గుంటూరులో చదువుతున్న ఏడుకొండలు కొడుకు శ్యామ్, కుమార్తె శ్రావణి సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చారు. వారితో కలిసి గుంటూరు వెళ్లేందుకు రెంటచింతలలో రైలు ఎక్కుతున్న సమయంలో కాలుజారి ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతిచెందాడు. అధిక సంఖ్యలో ప్రయాణికులు ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు యత్నించడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే ఎస్‌ఐ వెంకట్రావ్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంచనామ నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలింఆచరు. మృతుడు ఏడు కొండలు గ్రామంలో ముఠామేసీ్త్రగా పని చేస్తుంటాడు. మృతునికి భార్య పద్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment