సావిత్రిబాయి పూలే పురస్కారాలు ప్రదానం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉత్తమ బోధకులకు సావిత్రిబాయి పూలే జాతీయ ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. సదరన్ ప్రైవేటు లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్ (ఎస్పీఎల్‌టీఓ) ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు మార్కెట్ సెంటర్‌లోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్పీఎల్‌టీవో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ, తెలంగాణలకు చెందిన 181 మంది పురస్కారాలను అందుకున్నారు. మలినేని విద్యాసంస్థల చైర్మన్ మలినేని పెరుమాళ్లు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ అంగలకుదురు గాయత్రీదేవి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, బయోటెక్నాలజీ ప్రొఫెసర్ కె.వసుంధరలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఎన్‌యూ పాలకవవర్గ సభ్యుడు, కన్న విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.కన్న మాస్టరు, అపుస్మా సంయుక్త కోశాధికారి కాటూరి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ.. మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషిని కొనియాడారు. ఏసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొమ్మాలపాటి మోజెస్, ఏసీ న్యాయ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి.రాణి అమృత వర్షిణి, లాంప్ సంస్థ డైరెక్టర్ కొండపల్లి సాల్మన్ పాల్, ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ అమీనాబేగం, ఆర్గనైజేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె.గోవిందరాజులు, కొండపల్లి విల్సన్, కన్వీనర్ పీఆర్ రత్నకుమార్, ఎన్‌వీఎస్ రఘు ప్రదీప్, కార్యదర్శి ఎం. రాకేష్, పీఎస్ ఆదిత్య, మహిళా సమన్వయకర్త డి.నాగమణి, కన్వీనర్ ఎస్పీ రసూల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment