జీజీహెచ్‌కు రూ.9 లక్షల విరాళం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఇంకుడు గుంతల అభివృద్ధి ద్వారా ఆసుపత్రిలో నీటి కొరతను నివారించేందుకు గుంటూరు వైద్య కళాశాల 1980 బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థులు రూ. 9 లక్షలు విరాళం అందజేశారు. ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్‌కు పూర్వ వైద్య విద్యార్థులు రూ. 9 లక్షల చెక్కును అందజేశారు. ఈసందర్భంగా విరాళం అందజేసిన పూర్వ వైద్య విద్యార్థులు డాక్టర్ సిద్దాబత్తుని నాగేశ్వరమ్మ, డాక్టర్ శారద, డాక్టర్ రామారావులను డెప్యూటీ సూపరింటెండెంట్ అభినందనించారు.
ఫార్మసిస్టుల ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్:గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు కారార్యలయం పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పది గ్రేడ్–2 ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డీ డాక్టర్ జి.సుచిత్ర తెలిపారు. సదరు నోఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్టును మంగళవారం విడుదల చేశామన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టును, సెలక్షన్ లిస్టును సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు ఈనెల 27న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్డీ కార్యాలయంలో జరిగే కౌన్సిలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో హాజరు కావాలన్నారు.
బిక్కుబిక్కుమంటున్న కేజీబీవీ విద్యార్థినులు
ప్రాంగణం వద్ద కొండచిలువ, పాముల సంచారంతో బెంబేలు
సత్తెనపల్లి: పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ) చుట్టూ బయట వైపు అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో కొండచిలువ, రెండు పాములు మంగళవారం సంచరించాయి. పాఠశాల ప్రహరీ సమీపంలో అవి కనిపించడంతో విద్యార్థినులు బెంబేలెత్తి బయటకు పరుగులు తీశారు. పరిసరాలు అధ్వానంగా ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికై నా స్పందించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రహరీ నిర్మించాలని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
బంగారు కమ్మలు అపహరించిన మహిళ
అద్దంకి రూరల్: జ్యూయలరీ షాపులో బంగారు కమ్మలు అపహరించిన మహిళను గుర్తించిన షాపు యజమాని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించిన సంఘటన మంగళవారం అద్దంకిలో చోటుచేసుకుంది. అద్దంకి పట్టణంలోని శ్రీరామ బజారులోని హనుమాన్ జ్యూయలరీ షాపులో గుర్తు తెలియని మహిళ వచ్చి కమ్మల మోడల్స్ చూపించమని అడగటంతో అవి ఉన్న బాక్స్‌ను ఆమెకు ఇచ్చారు. అయితే అందులోని రెండు బంగారు కమ్మలను తీసుకుని వాటి స్థానంలో నకిలీ కమ్మలు పెట్టి ఇచ్చింది. ఇవేమీ వద్దు అని చెప్పి వెళ్లిపోయింది. తరువాత యజమానికి అనుమానం వచ్చి కమ్మల బాక్స్ చూడటంతో అందులో ఒక జత నకిలీవిగా గుర్తించి ఆమెను వెతికిపట్టుకున్నారు. గట్టిగా అడగటంతో తీసుకున్న కమ్మలు ఇచ్చింది. దీంతో షాపు యజమాని ఆమెను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు.
24న డీ ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో రెండేళ్ల కాల పరిమితి గల డీ ఫార్మసీ కోర్సులో 2024–25 విద్యాసంవత్సరానికి కౌన్సెలింగ్ తరువాత మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 24న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్ గ్రూపులు పూర్తి చేసిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలతో రూ.6,300 ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని సూచించారు. ఇతర వివరాలకు 92471 20305, 98480 38769, 99593 24563 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment