మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు
గుంటూరు ఎడ్యుకేషన్: యువతరం మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకోరాదని ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ పేర్కొన్నారు. జేకేసీ కళాశాలలో మంగళవారం మత్తు పదార్థాలు, ర్యాగింగ్, ట్రాఫిక్ నియంత్రణపై వారధి పేరుతో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలో గురువుల పట్ల గౌరవం, తోటి విద్యార్థుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటూ క్రమశిక్షణతో మెలిగిన వారే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని చెప్పారు. వ్యసనాలు, చెడు స్నేహాలకు బానిసలుగా మారితే ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. ర్యాగింగ్ నేరమని, కేసు నమోదైతే భవిష్యత్తుల్లో ఎక్కడా చదువుకునేందుకే కాకుండా ఉద్యోగం చేసే పరిస్థితులూ ఉండవని చెప్పారు. ఈవ్‌టీజింగ్, మత్తుపదార్థాల వినియోగం తదితర నేరాలకు నమోదు చేసే కేసులు, పడే శిక్షలు, ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.గోపీచంద్ మాట్లాడుతూ తమ కళాశాలలో ర్యాగింగ్‌కు తావులేదని వివరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రూపొందించిన పోస్టర్లను ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్, డీఎస్పీ కె.అరవింద్, కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్సార్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ పి.గోపీచంద్ ఆవిష్కరించారు. సదస్సులో ర్యాగింగ్, వేధింపుల వ్యతిరేక కమిటీల ఉపాధ్యక్షులు ఆర్. శ్రీనివాసరావు, అనితాకుమారి, ఎక్స్‌టెన్షన్ యాక్టివిటీస్ వైస్ చైర్మన్ పి.నాగసుశీల, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాగా పనిచేస్తే మహిళా పోలీసులకు అవార్డులు
తెనాలి రూరల్: పోలీసులను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తెలిపారు. తెనాలి చెంచుపేటలోని చావాస్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులతో ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం సమావేశమయ్యారు. వారి జాబ్‌చార్ట్ గురించి వివరించారు. ఉద్యోగ బాధ్యతల గురించి అవగాహన కల్పించారు. తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు, దిశ డీఎస్పీ సుబ్బారావుతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఎస్పీ సుమారు గంటన్నరపాటు మహిళా పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళా పోలీసుల సేవలను కూడా శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. బాగా పనిచేసిన మహిళా పోలీసులకు సబ్ డివిజన్ల వారీగా అవార్డులు ఇస్తామని ఎస్పీ ప్రకటించారు. సమావేశంలో డీఎస్పీలతో పాటు సీఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్, ఎస్ రమేష్ బాబు, బి.శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఎస్‌ఐ రాజ్యలక్ష్మి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ సతీష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment