హాహాకారం
ధరలు ఢమాల్.. రైతులు దిగాలు
క్వింటాకు రూ.20 వేలు వస్తే గిట్టుబాటు
నాది కర్నూలు జిల్లా, నందవరం మండలం, చిన్నకొత్తిలి గ్రామం. ఎకరా పొలంలో డీలక్స్ రకం మిర్చి పంట సాగుచేశా. ఇప్పటివరకు ఎకరాకు రూ.లక్ష అయ్యింది. మొదటి కోతగా మూడు క్వింటాళ్లు ఎరుపు కాయలు, మరో క్వింటా తాలు వచ్చింది. మొత్తం గుంటూరు యార్డుకు తీసుకొస్తే రూ.38 వేలే వచ్చాయి. మరో మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొత్తం మీద రూ.50 వేలు నష్టం రావొచ్చు. క్వింటా మిర్చికి రూ.20 వేలు లభిస్తేనే గిట్టుబాటవుతుంది.
– పులిచింత నరసప్ప, రైతు,
చిన్నకొత్తిలి గ్రామం, నందవరం మండలం, కర్నూలు జిల్లా.
ఫిబ్రవరి నుంచి మార్కెట్‌కు ఊపు
ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డులో ధరలు నిలకడగా ఉన్నాయి. తేజ, బాడిగ రకాలకు రూ.16 వేలు, 334, 341, నెంబర్–5 రకాలకు రూ.13 వేలు లభిస్తోంది. ప్రస్తుతం యార్డుకు అత్యధికంగా కోల్డ్‌స్టోరేజీల నుంచి వస్తోంది. ఏసీ సరుకు కావడంతో ఆరుదల లేకపోవడం, రంగు మారడంతో సరైన ధరలు రావడంలేదు. ఫిబ్రవరి నుంచి మార్కెట్ ఊపందుకుంటుందని ఆశిస్తున్నాం.
– వినుకొండ ఆంజనేయులు, మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/కొరిటెపాడు : మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. పైగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నల్లతామర తెగులు సోకి దిగుబడులు పడిపోవడంతో ధరలు ఊహించని విధంగా పతనమవడం రైతులపాలిట శాపంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో కలిపి పల్నాడు జిల్లాలో 1,07,485 ఎకరాల్లో, గుంటూరు జిల్లాలో 25,485 1,32,970 ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగుచేశారు. చీడపీడలు, తెగుళ్లు సోకి ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి మందులు పిచికారీ చేస్తున్నా తెగుళ్లు నాశనం కావడంలేదు. తాజాగా.. పూతలో తామరపురుగు కనిపించడంతో దిక్కుతోచని స్థితిలో రైతులున్నారు. దీని నివారణకు ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు. ఆచార్య రంగా యూనివర్శిటీ వారు రైతులకు సూచనలు ఇస్తున్నా ఇవేమీ అంతగా ఫలితం ఇవ్వడంలేదని రైతులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రభావం దిగుబడిపై తీవ్రంగా పడుతోంది.
మిర్చిని ఆరబెట్టుకుని తీసుకురండి..
ప్రస్తుతం మిర్చి యార్డుకు అత్యధికంగా కోల్డ్‌స్టోరేజీల నుంచి వస్తోందని.. ఏసీ కాయలు కావడంతో ఆరుదల లేకపోవడం, రంగు మారడంతో మెరుగైన ధరలు లభించడంలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త పంట కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతాల నుంచి కొంతమేర వస్తోందని.. మిర్చిని ఆరబెట్టుకుని నాణ్యతతో కూడిన సరుకు యార్డుకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాలు, నల్లతామర తెగులు ఎఫెక్ట్ పెట్టుబడి ఖర్చులూ రావడంలేదంటూ గగ్గోలు గుజరాత్, ఎంపీ, యూపీతోపాటుబంగ్లాదేశ్, బర్మా దేశాల్లోనూ ఎక్కువ సాగు ధరలు పతనానికి కారణం కనీసం క్వింటా రూ.20 వేలు పలికితేనే గిట్టుబాటు అంటున్న రైతులు మిర్చిని ఆరబెట్టుకుని తీసుకురావాలంటున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment