అదే సరీ! | - | Sakshi
Sakshi News home page

అదే సరీ!

Published Wed, Jan 22 2025 2:00 AM | Last Updated on Wed, Jan 22 2025 2:00 AM

అదే స

అదే సరీ!

గుంటూరు
బుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025

సాగునీటి సమాచారం

తాడేపల్లిరూరల్‌(దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధా న కాలువకు సీతానగరం వద్ద మంగళవారం 1818 క్యూసెక్కులు విడుదల చేశారు. కొమ్మమూరు కాలువకు 915 క్యూసెక్కులు వదిలారు.

జిల్లాలో మళ్ళీ రీ–సర్వే మొదలు

నాడు తప్పు... నేడు ఒప్పు..

సాక్షి ప్రతినిధి, గుంటూరు: నాడు తప్పు జరిగిపోతోందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే పనిని మళ్లీ మొదలుపెట్టింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా రీ సర్వే పనులను పూర్తి చేయడానికి సర్కారు నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి జిల్లాలో రీ–సర్వే మొదలైంది. ప్రస్తుతం 14 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా 26,329 ఎకరాల భూమిని సర్వే చేయాలని నిర్ణయించారు. మంగళవారం మూడు గ్రామాల్లో ఈ సర్వే మొదలైంది. 16 గ్రామాల్లో గ్రామ కంఠాలూ రీ–సర్వే చేయనున్నారు. దీన్ని పూర్తి చేయడానికి మూడు నెలల కాల వ్యవధిని నిర్దేశించారు. కొత్తగా మేడికొండూరు మండలం మందపాడు, ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెం, తాడికొండ మండలం లచ్చన్నగుడిపాడు, తుళ్లూరు మండలం వడ్డమాను, ఫిరంగిపురం మండలం మెరికపూడి, పెదకాకాని మండలం అనుమర్లపూడి, గుంటూరు పశ్చిమ అనుమర్లపూడి, గుంటూరు తూర్పు జొన్నలగడ్డ, చేబ్రోలు మండలం మంచాల, పొన్నూరు మండలం వల్లభరావుపాలెం, తెనాలి మండలం పెదరావూరు, కాకుమాను మండలం పాండ్రపాడు, కొల్లిపర మండలం కుంచవరం, దుగ్గిరాల మండలం పెరికర్లపూడి గ్రామాల్లో ఈ రీ–సర్వే మొదలు పెట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 62 గ్రామాలలో 1,42,450 ఎకరాల భూమిని రీ–సర్వే చేశారు. ఎనిమిది గ్రామాల్లో గ్రామకంఠం భూముల రీ–సర్వే కూడా పూర్తి చేశారు. గతంలో జరిగిన సర్వేను అలానే ఉంచి వాటిల్లో ఏమైనా ఫిర్యాదులు వస్తే వాటిని సరి చేసే యత్నం చేస్తారు.

గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా..

ఎప్పుడో 1905లో బ్రిటిషర్లు భూ సర్వే చేశారు. ఆ తర్వాత 2020 వరకు మరే నాయకుడు దీని జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ రీ–సర్వేని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీని ద్వారా ప్రతి అంగుళం భూమి మ్యాపింగ్‌లోకి తీసుకురావడంతోపాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దిశగా కృషి చేశారు. సర్వే ప్రక్రియ గుంటూరు జిల్లాలో 2020 డిసెంబర్‌లో ప్రారంభమైంది. తొలుత పైలెట్‌ ప్రాజెక్ట్‌గా దుగ్గిరాల మండలంలోని దేవరాపల్లి అగ్రహారం, ప్రత్తిపాడు మండలంలోని కొండజాగర్లమూడి, వేమూరు మండలంలోని పులిచింతలపాలెం, యడ్లపాడు మండలంలోని మర్రిపాలెం, దాచేపల్లి మండలంలోని అలుగుమల్లిపాడులను ఎంపిక చేసి విజయవంతంగా పూర్తి చేశారు. సర్వే అనంతరం సంబందిత భూమి, స్థలం యజమానికి ప్రింటెడ్‌ పాస్‌బుక్‌ ఉచితంగా ఇచ్చారు.

గతంలో పచ్చ పార్టీ, మీడియా దుష్ప్రచారం

గుంటూరు జిల్లాలో మొత్తం 223 గ్రామాలు ఉండగా గుంటూరు డివిజన్‌లో 119, తెనాలి డివిజన్‌లో 104 గ్రామాలు ఉన్నాయి. గతంలో 47 గ్రామాల్లో సర్వే ఆఫ్‌ ఇండియాకు, 121 గ్రామాల్లో యుక్రా అనే సంస్థకు సర్వే బాధ్యతలు అప్పగించారు. సర్వే ఆఫ్‌ ఇండియాకు అప్పగించిన 47 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి చేసింది. యుక్రా సంస్థ 46 గ్రామాల్లో డ్రోన్‌ను తిప్పింది. మొత్తం 93 గ్రామాల్లో డ్రోన్‌ను తిప్పి ఏరియల్‌ వ్యూ మ్యాపింగ్‌ పూర్తి చేశారు. 23 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐ(ఆర్ధో రెక్టిఫైడ్‌ ఇమేజెస్‌)అను జారీ చేశారు. వీటిని క్షేత్రస్థాయిలో భూమితో పోల్చి నిజనిర్ధారణ(గ్రౌండ్‌ ట్రూతింగ్‌) చేసే ప్రక్రియ 22 గ్రామాల్లో పూర్తి అయ్యింది. అయితే రికార్డులలో ఉన్న భూమికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేకపోవడం వల్ల సర్వే పూర్తి చేయడంలో కొంతమేర ఇబ్బందులు వచ్చాయి. భూ యజమానులు అందుబాటులో లేకపోవడం సర్వేలో ఆలస్యం అయ్యింది. ఇప్పుడు కూడా భూ యజమానుల సమక్షంలోనే సర్వే చేయాలని నిర్ణయించారు. చాలా చోట్ల పొలాలు కొన్న యజమానులు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఉండగా, మరికొన్ని చోట్ల విదేశాలలో ఉండటంతో వారిని రప్పించడం తలకు మించిన భారమైంది. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా అప్పట్లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి.

న్యూస్‌రీల్‌

14 మండలాల్లో 14 గ్రామాల్లో నేటి నుంచి ప్రారంభం గత ప్రభుత్వంలో మెజారిటీ గ్రామాల్లో సర్వే పనులు గతంలోనే 62 గ్రామాల్లో సర్వే పూర్తి ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లు హడావుడి

No comments yet. Be the first to comment!
Add a comment
అదే సరీ! 1
1/3

అదే సరీ!

అదే సరీ! 2
2/3

అదే సరీ!

అదే సరీ! 3
3/3

అదే సరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement