ఉత్కంఠగా భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. గోరంట్లలోని భాష్యం రామసేతు క్యాంపస్ సమీపంలోని జేఎస్‌ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహిస్తున్న భాష్యం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ లెవల్ టీ–20 క్రికెట్ టోర్నమెంట్ బీపీఎల్ 2024–25లో భాగంగా రెండో రోజైన మంగళవారం ప్రిలిమినరీ మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఉదయం హైదరాబాద్ హాక్స్ జట్టు–3తో గుంటూరు జెయింట్స్–3 తలపడగా, గుంటూరు జెయింట్స్–3 జట్టు విజయం సాధించింది. అదే విధంగా మధ్యాహ్నం కృష్ణా నైట్స్, వైజాగ్ వెలాసిటీ జట్ట మధ్య జరిగిన మ్యాచ్‌లో వైజాగ్ వెలాసిటీ జట్టు గెలుపొందింది. ఈసందర్భంగా విజేతలుగా నిలిచిన జట్లకు భాష్యం రామకృష్ణ ట్రోఫీలను బహూకరించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్‌రామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment