ఎంఎస్‌ఎంఈలకు ఊరట
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాపై నిర్మలమ్మ శీతకన్ను వేసింది. కేంద్ర బడ్జెట్‌లో రాజధానికి ఒక్కపైసా కూడా కేటాయించకుండా మొండిచెయ్యి చూపింది. రాజధానికి కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు వస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ వచ్చినా బడ్జెట్‌లో చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాజధానికి ప్రపంచ బ్యాంకు ఇచ్చే గ్రాంటు నిధుల గురించి ప్రస్తావనే లేదు.
ఉద్యోగులకు పన్నులో ఆదా
మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఆదాయపున్ను మినహాయింపు పెంపుదలపై కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడంతో వేతన జీవుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఏడాదికి రూ.12.75 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఉద్యోగులకు రూ.75వేలు వరకు పన్ను ఆదా అవుతుంది. జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 30 వేలమందికి లబ్ధి చేకూరుతుంది. సీనియర్ సిటిజిన్లకు పన్ను శ్లాబుల్లో ఎటువంటి ప్రత్యేక రాయితీ ఇవ్వకపోవడంతో వారు నిరాశ చెందారు.
పత్తి రైతులకు ఊరట
పప్పు ధాన్యాలకు స్వయం సంవృద్ధి పథకాన్ని ప్రకటించింది. జిల్లాలో సుమారు 46 వేల ఎకరాల్లో మినుము, పెసర, కంది సాగు అవుతోంది. జాతీయ పత్తి మిషన్ ప్రకటించడంతో కొంత మేర రైతులకు ఊరట కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో పత్తి విస్తీర్ణం ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. మరోవైపు సీసీఐ పత్తి కొనుగోలు చేసే విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. పత్తి మిల్లులకు లాభం చేకూరేలా సీసీఐ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పత్తి మిషన్ ఏర్పాటు వల్ల రైతులకు ఏం ఉపయోగం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు. గుంటూరు జిల్లా పరిధిలో 26,982 హెక్టార్లలో పంట సాగు అవుతోంది. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కేటాయింపులు నామమాత్రంగా ఉండటంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి.
కనికరించని ఆర్థిక మంత్రి నిర్మల
బడ్జెట్‌లో రాజధానికి మొండిచెయ్యి
జాతీయ పత్తి మిషన్ ప్రకటనపై
స్పష్టత కరువు
ఆదాయ పన్ను సీలింగ్ పెంచటంతో
వేతన జీవులకు ఊరట
కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి
పెంపుతో రైతులకు ఉపయోగం లేదు
కిసాన్ క్రెడిట్ కార్డుల రుణపరిమితిని పెంచారు. దీనివల్ల రైతులను అప్పుల వైపు నెట్టడమే కాని ఆదుకునే చర్యలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 3,82,513 కిసాన్ క్రెడిట్ కార్డులున్నాయి. ఎంఎస్‌ఎంఈలకు రుణ పరిమితిని పెంచారు. గతంలో వీటికి ఐదు కోట్ల రూపాయల వరకూ పరిమితి ఉండగా తాజాగా దాన్ని పది కోట్ల రూపాయలకు పెంచారు. జిల్లాలో ఉన్న 72,094 ఎంఎస్‌ఎంఈలకు ఈ నిర్ణయం వల్ల కొంత మేర ఊరట కలగవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment