నేడు కానుకమాత చర్చి 175వ తిరునాళ్ల
రెంటచింతల: కానుకమాత చర్చి 175వ తిరునాళ్ల మహోత్సవానికి సిద్ధమైనట్లు విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఏరువ లూర్ధుమర్రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా వేల మంది పాల్గొని కానుకమాత ఆశీస్సులు పొందాలని కోరారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు మొదటి దివ్యపూజాబలి సమర్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య, కడప పీఠం అపోస్తలిక పాలనాధికారి డాక్టర్ గాలి బాలి, నల్గొండ పీఠం విశ్రాంత పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ గోవింద్ జోజి, 75 మందికి పైగా ఫాదర్లతో పండుగ పవిత్ర సమిష్టి మహోత్సవ దివ్యపూజాబలి నిర్వహించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment