ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ కలిగించారు. బిహార్‌కు నిధులు, ప్రాజెక్టుల వరద పారించారు. రాష్ట్రంలో అమరావతి, మెట్రో రైలు ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు. వృద్ధులకు బాండ్లపై పన్ను వెసులుబాటు కల్పించారు. అయితే, 70 ఏళ్లు పైబడినవారికి పూర్తిగా వెసులుబాటు కల్పిస్తే బాగుండేది. వ్యవసాయానికి రూ.1,71,437 కోట్లు కేటాయించినా, యువత సేద్యం వైపు మొగ్గు చూపేందుకు ప్రత్యేకంగా ఏ పథకం లేదు. గ్రామీణాభివృద్ధికి కేటాయించిన రూ.2,66,817 కోట్లు బొటాబొటిగా సరిపోతాయి. విద్యారంగానికి కేటాయింపులు అంతంతమాత్రమే. దేశంలో మధ్యతరగతివారికి 40 వేల ఇళ్లు ఏ మాత్రం సరిపోవు. ఆదాయ పన్ను పరిమితి రూ.12 లక్షలకు పెంచడంలో అంకెల గారడీ కనిపిస్తోంది. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదు.
– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి,
ఉప కులపతి, దళిత సార్వత్రిక
విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment