రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగ పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగ పోటీలను నిర్వహిస్తున్నట్లు జేవీవీ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.జాన్‌బాబు, బి.ప్రసాద్ తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సైన్స్ ప్రయోగ పోటీల పోస్టర్లను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు, సృజనాత్మకతను పెంచేందుకు నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం – సుస్థిరాభివృద్ధి, మూఢ నమ్మకాలు – శాసీ్త్రయ దృక్పథం అనే అంశాలపై 8,9,10 తరగతుల విద్యార్థులు ఐదు నిమిషాల నిడివి గల వీడియోను పంపాలని సూచించారు. వివరాలకు 90004 53600 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో జేవీవీ నాయకులు జి.వెంకట్రావు, టీఆర్ రమేష్, డాక్టర్ ఏ. సత్యనారాయణ ప్రసాద్, ఎస్‌ఎం సుభానీ, యశ్వంత్, భారవి, వీవీకే సురేఖఖ్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా వాసికి జాతీయ రంగస్థల పురస్కారం
బాపట్ల: బాపట్ల జిల్లా ఆదర్శనగర్‌కు చెందిన సంగాని ఏడుకొండలుకు జాతీయ రంగస్థల పురస్కారం దక్కింది. తెలుగు సంస్కృతి–సాహిత్య సేవా ట్రస్టు, ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్స జాతీయ స్థాయి మొదటి వార్షికోత్సవం విజయవాడలో జరిగింది. వార్షికోత్సవంలో బాలచంద్రుడు ఏకపాత్రను ప్రదర్శించిన సంగాని ఏడుకొండలుకు స్వర్ణకంకణంతోపాటు జాతీయ రంగస్థల పురస్కారం లభించింది. 36ఏళ్లుగా పౌరాణిక, నాటకం ప్రదర్శించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన సంగానికి పురస్కారం రావటంపై పలువురు అభినందనలు తెలిపారు. మరోన్నె పురస్కారాలు సొంతం చేసుకోవాలని బాపట్ల నవ్యనాటక కళాసమితి అధ్యక్షులు సోమరాజు శ్రీను కోరుకున్నారు.
ఎకై ్సజ్ చట్టాలను అతిక్రమిస్తే చర్యలు
జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు
నగరం: ఎకై ్సజ్ చట్టాలను విధిగా పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎకై ్సజ్ చట్టాలకు అనుగుణంగా మద్యం షాపులు నడపాలన్నారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరపాలన్నారు. బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ప్రజల వద్దకే మద్యం కథనంపైన ఆయన ఆరా తీశారు. సమావేశంలో సీఐ మారుతి శ్రీరామ్‌ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
రేపల్లె రూరల్: రేపల్లె ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో బెల్టు షాపుల నిర్వహణ లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూడవ విడత చలానా వివరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సీఐ దివాకర్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment