గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5వ తరగతులను విలీనం చేస్తూ గత ప్రభుత్వం అమలు చేసిన జీవో నెంబరు 117ను ఇటీవల కూటమి ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో బుధవారం గోరంట్లలోని నెక్ట్స్‌జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులతో అంతర్గతంగా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 3, 4, 5వ తరగతులను గతంలో మాదిరిగా ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు. గ్రామ స్థాయిలో ఐదు తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment