కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు కష్టాలు రెట్టింపయ్యాయి. పింఛను మొత్తం పెంచామని చెబుతూనే లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి ప్రభుత్వం వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పింఛను పొందుతున్నా సరే దివ్యాంగులకు కొత్తగా సదరమ్‌ క్యాంపులు పెట్టి | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు కష్టాలు రెట్టింపయ్యాయి. పింఛను మొత్తం పెంచామని చెబుతూనే లబ్ధిదారుల సంఖ్య తగ్గించడానికి ప్రభుత్వం వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పింఛను పొందుతున్నా సరే దివ్యాంగులకు కొత్తగా సదరమ్‌ క్యాంపులు పెట్టి

Published Thu, Jan 23 2025 2:06 AM | Last Updated on Thu, Jan 23 2025 2:06 AM

కూటమి

కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు కష్టాలు రెట్టింపయ్య

తెనాలిలో ఆలస్యంగా మొదలైన సదరమ్‌ క్యాంప్‌

మొదటి రోజు వంద మందికి వివిధ వైద్య పరీక్షలు

కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడిన లబ్ధిదారులు

తెనాలి అర్బన్‌: దివ్యాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలన కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరమ్‌ క్యాంప్‌ గంటకుపైగా ఆలస్యంగా ప్రారంభమైంది. వికలాంగులు ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి వచ్చి గంటలకొద్ది వేచి ఉండి పునఃపరీక్షలు చేయించుకున్నారు. కొందరు నడవలేని స్ధితిలో ఉండటంతో అక్కడకు తెచ్చేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి పట్టణంలో 15,145 పింఛను దారులకుగాను దివ్యాంగులు 1,639 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.6 వేల చొప్పున పింఛన్‌ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో గత కొద్దిరోజుల క్రితం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. వారిని మంచానికే పరిమితమైన లబ్ధిదారుల ఇళ్లకు పంపి పరీక్షలు చేయించింది. అంతటితో ఆగకుండా దివ్యాంగ లబ్ధిదారులపై విచారణ ప్రారంభించింది. దీనిలో భాగంగా తెనాలి, గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలలో బుధ, గురు, శుక్రవారాలలో ప్రత్యేక సదరమ్‌ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బుధవారం తెనాలి జిల్లా వైద్యశాలలోని మొదటి అంతస్తులో ఉన్న కంటి విభాగంలో, డైక్‌ సెంటర్‌లో ఈఎన్‌టీ విఽభాగ పరీక్షలను నిర్వహించింది. ప్రతిరోజు తెనాలి పట్టణ పరిఽధిలోని 100 మంది పరీక్షలు చేయించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఆప్తమాలజీ –50, ఈఎన్‌టీ –50 మంది చొప్పున పంపుతున్నారు. ప్రతి రోజు ఉదయం 9 – సాయంత్రం 4 గంటల వరకు శిబిరం ఉంటుంది. బుధవారం తెనాలి జిల్లా వైద్యశాలలో గంట ఆలస్యంగా క్యాంప్‌ ప్రారంభమైంది. ఉదయాన్నే చేరుకున్న పలువురు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌభాగ్యవాణి మాట్లాడుతూ ప్రతి నెల మూడు రోజులపాటు ఉంటుందని, దివ్యాంగులు వారికి కేటాయించిన సమయంలో వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

రెండేళ్లకే మళ్లీ పరీక్షలా?

రెండేళ్ల నుంచి దృష్టిలోపం వచ్చింది. చూపు పూర్తిగా పోవటంతో ప్రభుత్వం పింఛన్‌ ఇస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ పరీక్షలు చేయించుకోవాలని సచివాలయ ఉద్యోగులు చెప్పారు. నా లాంటి చూపులేని వారు తోడు లేకుండా ఇక్కడకు వచ్చే పరిస్థితి లేదు. రెండేళ్లకే మరోసారి పరీక్షలు అంటే ఇబ్బందికరంగా ఉంది.

–షేక్‌ బాషా, నందులపేట, తెనాలి

మాలాంటి వారికి తీవ్ర ఇబ్బంది

నాకు చిన్ననాటి నుంచి చెవుడు ఉంది. అది కొంత కాలానికి ఎక్కువ అయింది. అప్పటి నుంచి ప్రభుత్వ పింఛన్‌ తీసుకుంటున్నా. 15 సంవత్సరాల క్రితం పక్షవాతం రావటంతో కాలు, చెయ్యి పూర్తిగా పడిపోయింది. అప్పటి నుంచి వీల్‌ చైర్‌లోనే జీవనం సాగిస్తున్నా. మా లాంటి నడవలేని రోగులను ఇబ్బంది పెట్టడం సరికాదు.

– కె.రాజు, ఐతానగర్‌, తెనాలి

No comments yet. Be the first to comment!
Add a comment
కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు కష్టాలు రెట్టింపయ్య1
1/2

కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు కష్టాలు రెట్టింపయ్య

కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు కష్టాలు రెట్టింపయ్య2
2/2

కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు కష్టాలు రెట్టింపయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement