దాసకుటి ఆశ్రమంలో శ్రీసీతారాముల కళ్యాణం
తెనాలి: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రూరల్ మండలం అంగలకుదురులో గల వాసుదాసస్వామి పరంపర పీఠం (దాసకుటి) ఆశ్రమంలో బుధవారం శ్రీసీతారామస్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు తమ స్వగృహాల నుంచి తలంబ్రాలను ఆశ్రమానికి తీసుకొచ్చారు. అక్కడ రాములు వారి కళ్యాణ వేడుకను ఘనంగా జరిపించారు. సంకీర్తనలు, కోలాట ప్రదర్శన చేశారు. చిన్నారులు దేవతామూర్తుల వేషధారణలో ఆకట్టుకున్నారు. భక్తులకు అన్న సంతర్పణ జరిగింది. ఆశ్రమ అధ్యక్షుడు ఉలిచి సీతారామశర్మ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట విభాగ ప్రచారక్ అవ్వారు శ్రీనివాస్, ఆంధ్ర వాల్మీకి పీఠం, హిందూ ఐక్యవేదిక, విశ్వహిందూ పరిషత్, అంగలకుదురు గ్రామ వాసుదాస పరంపర పీఠం ఆశ్రమ కమిటీ నాయకులు టి.హనుమత్‌ప్రసాద్, కడియాల సునీల్, కడియాల నందకిషోర్, బలభద్రపాత్రుని సుబ్బారావు, రామాంజనేయులు, గ్రామ పెద్దలు, రామభక్తులు పాల్గొన్నారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద బుధవారం 1818 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 144, తూర్పు కెనాల్‌కు 215, పశ్చిమ కెనాల్‌కు 101, నిజాంపట్నం కాలువకు 99, కొమ్మమూరు కాలువకు 975 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment