ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు
నెహ్రూనగర్: శంకర్‌విలాస్ ఆర్వోబీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. అరండల్‌పేట, బ్రాడిపేటల్లో రోడ్లపై ఆక్రమణలను యుద్ధప్రాతిపదిన తొలగించడానికి, రోడ్ల మరమ్మతులను చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం అరండల్ పేట 1వ లైన్, బ్రాడీపేట 1, 4వ లైన్‌లు, లాడ్జి సెంటర్ నుంచి బ్రాడీపేట వైపుగా కంకరగుంట ఆర్వోబీకి వచ్చే మార్గం, డొంక రోడ్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆక్రమణలు తొలగించి రోడ్లు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కమర్షియల్ సంస్థలు, టిఫిన్ బండ్లు వారు వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని గుర్తించారు. వారికి భారీగా జరిమానా విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. వార్డ్ సచివాలయాల వారీగా డంపింగ్ పాయింట్స్ లేకుండా వ్యర్థాలను తొలగించడంపై ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఎస్‌లు దృష్టి సారించాలన్నారు. ఎస్‌ఈ నాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఈఈ కోటేశ్వరరావు, డీఈఈ రమేష్ బాబు, ఏసీపీలు రెహ్మాన్, మల్లికార్జున, ఎస్‌ఎస్ సోమశేఖర్, టీపీఎస్‌లు, ఏఈలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు స్వీకరణ
గుంటూరు నగరపాలక సంస్థ స్థాయీ సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికకు బుధవారం నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించారు. 6వ వార్డ్ కార్పొరేటర్ పి.సమత నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment