యువశక్తితో అద్భుతాల ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: యువశక్తితో అద్భుతాలు ఆవిష్కరించొచ్చని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో భాష్యం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ లెవల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ బీపీఎల్ 2024–25లో భాగంగా ఆదివారం జేకేసీ కళాశాల మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ హైలాండర్స్–2 జట్టుతో తలపడిన వైజాగ్ వెలాసిటీ–3 జట్టు విజేతగా నిలిచి భాష్యం ప్రీమియర్ లీగ్ చాంపియన్‌షిప్‌ను చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యాసంస్థలు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నాయని వివరించారు. భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో మొత్తం 720 మ్యాచ్‌లు నిర్వహించామని, బ్రాంచ్ స్థాయిలో 420, జోనల్ స్థాయిలో 281, సెంట్రల్ స్థాయిలో 19 మ్యాచ్‌లు జరిగాయని తెలిపారు. సెంట్రల్ టోర్నమెంట్లో భాగంగా ప్రిలిమినరీస్, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించినట్లు వివరించారు. అనంతరం వైజాగ్ వెలాసిటీ–3 జట్టుకు భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ ట్రోఫీని అందజేశారు.
త్యాగధనుల స్ఫూర్తి ఆదర్శం
గుంటూరు ఎడ్యుకేషన్: త్యాగధనుల స్ఫూర్తి ఆదర్శమని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రమౌళీనగర్‌లోని భాష్యం మెయిన్ క్యాంపస్ వద్ద ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భాష్యం బ్లూమ్స్‌లో కాటూరి మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శిల్ప జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల పిరమిడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ ముగిసిన భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్న వైజాగ్ వెలాసిటీ–3 జట్టు
Comments
Please login to add a commentAdd a comment