రూ.7.600 కోట్ల జీఎస్టీ రెవెన్యూ లక్ష్యం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : జీఎస్టీ ఉద్యోగులు దేశ ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఐదు జిల్లాల(ప.గో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి సూచించారు. స్థానిక కన్నవారితోటలోని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. సిబ్బంది కవాతు నిర్వహించి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గుంటూరు జీఎస్టీ కమిషనరేట్ పరిధిలో రూ.7,600 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికి రూ.5,370 కోట్ల పన్ను వసూలు చేసినట్లు వివరించారు. కమిషనరేట్ పరిధిలో పన్ను ఎగవేత రూ.345 కోట్లుగా ఉన్నట్లు గుర్తించగా, దానిలో రూ.146 కోట్లు ఇప్పటికే రాబట్టామని పేర్కొన్నారు. అదనపు ఆదాయ సేకరణ, పన్ను ఎగవేత గుర్తింపు, అక్రమ వస్తువుల స్వాధీనం కోసం అధికారులు కృషి చేయాలన్నారు. ఇటీవల గుంటూరులో రూ.12.39 కోట్ల విలువైన చట్ట విరుద్ధమైన సిగరెట్లు, గంజాయి, చైనీస్ వెల్లుల్లిని దహనం చేసినట్లు గుర్తుచేశారు. అనంతరం అంకితభావంతో పనిచేసిన అధికారులకు కమిషనర్ ప్రశంసాపత్రాలు అందచేశారు. కార్యక్రమంలో నల్లపాడు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు జానపదం, శాసీ్త్రయ నృత్యాలతో అలరించారు. కాసుల కృష్ణంరాజు చేసిన మ్యాజిక్ షో, డ్రాగన్ షోలు ఉద్యోగులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
ఇప్పటికే రూ.5,370 కోట్లు వసూలు లక్ష్యసాధనకు ఉద్యోగులు కృషి చేయాలి సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment