ప్రపంచ దేశాలకు మన రాజ్యాంగం ఆదర్శం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ దేశాలకు మన రాజ్యాంగం ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కె.మోషేన్ రాజు పేర్కొన్నారు. ఆదివారం మార్కెట్ సెంటర్‌లోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కేవీర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీజీఎస్ పబ్లిషర్స్ ప్రచురించిన ‘భారత రాజ్యాంగం‘ (సంక్షిప్తంగా) పుస్తకాన్ని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆవిష్కరించారు. అదే విధంగా ‘రాజ్యాంగ నిర్మాణం–రాజ్యాంగ పీఠిక‘ పుస్తకాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఫొటోలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం పుస్తకాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు పుస్తకాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, సమకాలీన వ్యాసాలు పుస్తకాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వలి ఆవిష్కరించారు. మోషేన్‌రాజు మాట్లాడుతూ రాజ్యాంగం విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమ నిర్వాహకుడు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ లౌకికవాద సంరక్షణ అందరి లక్ష్యం కావాలన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతున్న ప్రతిసారీ న్యాయవ్యవస్థ ప్రజల పక్షాన బలంగా పని చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో కేవీఆర్, జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శి కె.అలీన్, కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఈవీ నారాయణ, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, కన్న మాస్టారు, అవధానుల హరి, ఆవాజ్ నాయకులు చిష్టి, విశ్లేషకులు బి.మల్లికార్జునరావు పాల్గొన్నారు.
శాసనమండలి చైర్మన్ కె.మోషేన్ రాజు
Comments
Please login to add a commentAdd a comment