70శాతం డబ్లింగ్ పనులు పూర్తి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): నిర్దేశిత లక్ష్యాల సాధనకు రైల్వేశాఖ సిబ్బంది కృషి చేస్తున్నట్టు గుంటూరు రైల్వే డీఆర్‌ఎం రామకృష్ణ చెప్పారు. నల్లపాడు రైల్వే పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ముందుగా డీఆర్‌ఎం రామకృష్ణ జాతీయ పతాకావిష్కరణ చేశారు. డివిజన్ పరిధిలోని రైల్వే పోలీసులు కవాతు నిర్వహించి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి రైల్వే శాఖ ఇచ్చిన లక్ష్యాలను అధిగమించినట్టు వివరించారు. సరుకు రవాణాలో ముందున్నామన్నారు. డివిజన్ పరిధిలోని సిబ్బంది జాతీయస్థాయి అవార్డులు దక్కించుకున్నారని వివరించారు. కొత్త రైల్వే లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్ పనులను ఇప్పటికే 70 శాతం పూర్తిచేసినట్టు వెల్లడించారు. అనంతరం డివిజన్ పరిధిలోని పలు విభాగాధిపతులకు ప్రశంసా పత్రాలను డీఆర్‌ఎం అందజేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
గణతంత్ర దినోత్సవంలో రైల్వే డీఆర్‌ఎం రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment