రక్తనాళాల సమస్యను గుర్తించకుంటే ప్రాణాపాయం
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల రక్తనాళాల్లో సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, వాటిని సకాలంలో గుర్తించకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్ వ్యాస్క్‌లర్ సర్జన్స్ చెప్పారు. ఆదివారం గుంటూరు వైద్య కళశాల జింకానా ఆడిటోరియంలో వ్యాస్క్‌లర్ సర్జన్‌ల నిరాంతర వైద్య విద్య కార్యక్రమం(సీఎంఈ) జరిగింది. కార్యక్రమంలో సీఎంఈ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ విష్ణుమొలకల విజయ్‌కుమార్ మాట్లాడుతూ రక్తనాళాల్లో సమస్యలను గుర్తించేందుకు అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయని, ఆధునిక సర్జరీలూ వచ్చాయని వివరించారు. డాక్టర్ తుపాకుల సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ఎండో వ్యాస్క్‌లర్, ఓపెన్ సర్జరీల సాంకేతికతను హైబ్రిడ్ విధానాలుగా పిలుస్తారని పేర్కొన్నారు. డాక్టర్ నాగులపాటి సురేంద్ర మాట్లాడుతూ ఫెరిఫెరల్ వ్యాస్క్‌లర్ వ్యాధిని ఎలా గుర్తించాలి, చికిత్స గురించి వివరించారు. పీజీ వైద్య విద్యార్థులకు వ్యాస్క్‌లర్ ఆనస్టామోటిక్ శిక్షణ ఇచ్చారు. వ్యాస్క్‌లర్ సర్జన్లు డాక్టర్ సంజన్ జి.దేశాయ్, డాక్టర్ ఆర్.చంద్రశేఖర్, డాక్టర్ సాహు, డాక్టర్ హర్ష, డాక్టర్ దివాకర్, డాక్టర్ మాచినేని కిరణ్, తదితరులు పాల్గొని పీజీ వైద్య విద్యార్థులకు పలు అంశాలు వివరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గుంటూరు వ్యాస్క్‌లర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలు వైద్య కళాశాలకు చెందిన పీజీ వైద్యులు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment