No Headline
ఖిలా వరంగల్: వరంగల్ 39వ డివిజన్ ఎస్సీ కాలనీ సాకరాశికుంటలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కాలనీలో సుమారు 400ల పేద కుటుంబాలు నివాసం ఉంటాయి. సరైన డ్రెయినేజీ వ్యవస్థలేదు. ఇటీవల వర్షాలకు మురుగునీరు పారి భరించలేని దుర్వాసన వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు దోమలు విజృంభిస్తున్నాయి. ఖాళీ స్థలాలలోని మురుగునీరు బయటకు పోయే పరిస్థితి కనిపించడంలేదు. 15రోజులకోసారి కూడా మురుగు కాల్వలను శుభ్రపర్చడం లేదని వాపోతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా ఖాళీ స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి.
దోమలతో కునుకు కరువు
కాలనీలో ఇళ్ల ముందే మురుగునీరు ఉంటుంది. పందులు, దోమలు విజృంభిస్తున్నాయి. ఇంటిల్లిపాది జ్వరాల బారిన పడుతున్నాం. పగలు, రాత్రి దోమల మోతతో నిద్రకు దూరమయ్యాం. ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.
కలకోట్ల భాగ్యలక్ష్మి, సాకరాశికుంట
Comments
Please login to add a commentAdd a comment