వైభవంగా భోగి
నేడు సంక్రాంతి ● రేపు కనుమ
గ్రేటర్ వరంగల్ నగర వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. మంటల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. వాకిళ్లన్నీ రంగవల్లులతో నిండిపోయాయి. రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నువ్వుల పిండి రాసి చిన్నారులకు స్నానం చేయించి.. హారతి పట్టారు. బొడబొడికెలు పోశారు. పిండి వంటలు ఘుమఘుమలాడాయి. చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. పండుగ సామగ్రి, నోముల విక్రయాలతో మార్కెట్లో సందడి నెలకొంది. చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. పలు వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నగరంలో అక్కడక్కడా బసవన్నలు సందడి చేశాయి. ప్రజలు గోవులను భక్తితో పూజించారు. పలు కాలనీల్లో ముగ్గుల పోటీలు జరిగాయి. నేడు సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment