రుద్రేశ్వరుడికి పూజలు
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరస్వామికి సోమవారం భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని పాశుపత రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించా రు. పండుగ నేపథ్యంలో వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నా రు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన అర్చకులు ఉదయం నుంచి నిత్యపూజలు చేపట్టారు. దేవాదాయశాఖ సిబ్బంది ఎన్.మధుకర్, రామకృష్ణ, రజిత పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తామని ఉపేంద్రశర్మ తెలిపారు.
సంక్రాంతి పండుగ
సంతోషంగా జరుపుకోవాలి
హన్మకొండ అర్బన్ : జిల్లా ప్రజలు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఈ మేరకు జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. పండుగ ప్రజలందరికీ భోగభాగ్యాలు అందించాలని ఆకాంక్షించారు.
భక్తులకు మెరుగైన
వైద్య సేవలు అందించాలి
ఎంజీఎం : కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. సోమవారం ఆయన జాతరలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరా న్ని సందర్శించి సేవలు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 18వ తేదీ వరకు వైద్యశిబిరం కొనసాగుతుందని, వైద్యులు, 36 మంది పారా మెడికల్ సిబ్బందికి మూడు షిఫ్టుల్లో డ్యూటీలు వేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల నిమిత్తం రెండు 108 అంబులెన్స్ సర్వీసులు అందుబా టులో ఉన్నాయని, వైద్య సిబ్బంది జాతరకు వచ్చే భక్తులకు చలికాలం జాగ్రత్తలు, వివిధ ఆరోగ్య సూత్రాలకు సంబంధించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. డాక్టర్ పి.ప్రదీప్‌రెడ్డి, డెమో వి.అశోక్‌రెడ్డి, డాక్టర్ ఎస్.మౌనిక, ఎస్.వినోద్‌కుమార్, హెచ్‌ఈఓ ఎస్.రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుస్తీ పోటీలకు
మహిళా జట్టు ఎంపిక
కేయూ క్యాంపస్ : పంజాబ్ రాష్ట్రం బటిండా గురుకాశీ యూనివర్సిటీలో మంగళవారం నుంచి జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ కుస్తీ ప్రీ స్టైల్ మహిళల టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసిన ట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య సోమవారం తెలియజేశారు. ఈ జట్టులో సుమయ్యతబుస్సమ్, బి.ప్రణవి, జె.మాధురి (కిట్స్, వరంగల్), జె.చిన్ని, కె.నిహారిక (కాకతీయ ప్రభుత్వ డిగ్రీకాలేజీ, హనుమకొండ), ఎస్.కారుణ్య (వీసీపీఈ, బొల్లికుంట వరంగ ల్), కె.రేణుక (టీటీడబ్ల్యూఆర్‌డీసీ, కొత్తగూడెం), శేజ్రా మహేవిన్(త్రివేణి డిగ్రీకాలేజీ, భద్రాచలం) ఉన్నారు. టీజీటీడబ్ల్యూఆర్‌డీసీ(ఉమెన్) వరంగల్ వెస్ట్ ఫిజికల్ డైరెక్టర్ జ్యోతి మేనేజర్‌గా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment