అర్ధరాత్రి దొంగల హల్‌చల్
ఇంటి తాళాలు ధ్వంసం
హసన్‌పర్తి : దొంగల సంచారంతో మండల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రెండ్రోజుల క్రితం ఆదర్శకాలనీలో ముగ్గురు దొంగతనానికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. ఆదర్శ నగర్‌కాలనీలో చోరీకి చేయడానికి వచ్చిన వారు నాలుగిళ్ల తాళాలు పగులగొట్టారు. ఆ ఇళ్లలో వారికి ఏమి లభించలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఇక్కడికి వచ్చి అద్దెకు ఉంటున్నారు. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారు సొంత ఊళ్లకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాళం వేయకుండా ఉన్న ఇళ్లల్లోనూ ముసుగు ధరించిన దొంగలు చోరీకి యత్నించినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైంది.
తాళాలు ఉన్న ఇళ్లే టార్గెట్..
చోరీకి వచ్చిన దొంగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ చేసుకుంటున్నట్లు స్థానికులు చర్చంచుకుంటున్నారు. ముందుగా తాళాలు పగులగొట్టి ఇంట్లో చొరబడి లూటీ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్లే దొంగల సంచారం అధికమైందని కాలనీవాసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment