అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
కేయూ క్యాంపస్: సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన పతంగుల పండుగ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఆయన పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, చిన్నారులంతా సరదాగా పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి సంప్రదాయాల్లో సంక్రాంతి పండుగు ఎంతో ప్రత్యేకమైందన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులపాటు నిర్వహించుకునే ఈ వేడుకలతో ప్రజలందరికీ భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజేందర్‌రెడ్డి సతీమణి నీలిమ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment