ఛిద్రమైన చింతల్‌రోడ్
న్యూశాయంపేట : ఖిలా వరంగల్ పెట్రోల్‌పంప్ జంక్షన్ నుంచి చింతల్ ఫ్లైఓవర్ వరకు రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. రహదారి మొత్తం గుంతలమయమైంది. ద్విచక్ర వాహనదా రులు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే సాహ సం చేయాల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికలముందు అప్పటి మంత్రి కేటీఆర్ రాక కోసం తూతూమంత్రంగా మరమ్మతులు చేసినా ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతింది. తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తిస్థాయిలో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు వేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.
పూర్తిస్థాయిలో రహదారిని నిర్మించాలి
చింతల్‌రోడ్డును పూర్తిస్థాయిలో సిమెంట్ కాంక్రీట్‌తో పనులు చేపట్టాలి. ఈ రహదారి వెడల్పు కోసం గత ప్రభుత్వంలో కొంతవరకు పనులు చేసినా పూర్తి కాలేదు. వర్షాలతో పూర్తిగా ధ్వంసమైంది. మంత్రి సురేఖ చొరవ తీసుకుని రహదారి పనులు చేపట్టాలి.
– ఆడెపు వెంకటేశ్
Comments
Please login to add a commentAdd a comment