ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలను వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్‌యాదవ్ ప్రారంభించారు. అండర్–8, 10, 12, 14, 16,18,20 సంవత్సరాల బాలబాలికల విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఆయా పాఠశాలల నుంచి సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు అసోసియేషన్ కార్యదర్శి యుగేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను ఈ నెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే సౌత్‌జోన్ పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ పోరాట
అస్తిత్వం ఐలమ్మ
హన్మకొండ : తెలంగాణ పోరాట అస్తిత్వం చాకలి ఐలమ్మ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, బీఆర్‌ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పి ంచారు. తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు, అన్యాయాన్ని ఎదురించిన ధీరవనిత, భూ స్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
డుండిగణపతిగా అలంకరణ
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు మంగళవారం నాల్గవ రోజుకు చేరుకున్నాయి. మూలమహాగణపతిని డుండిగణపతిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. వేముల సత్యమూర్తి–ఉమాదేవి సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేపట్టారు.
విద్యార్థులకు అభినందన
కాజీపేట అర్బన్ : ప్రాగ్రాన్స్ ఆఫ్ ఆర్ట్ బడ్స్–24 ఇంటర్నేషనల్ డ్రాయింగ్ పోటీలో కేవీ (కేంద్రీయ విద్యాలయ) విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. డ్రాయింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్స్, జ్యురీ అవార్డులు సాధించిన విద్యార్థులను, డ్రాయింగ్ టీచర్ అన్నబత్తుల వెంకన్నను కడిపికొండలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఆవరణలో ప్రిన్సిపాల్ సుభాషిణి మంగళవారం అభినందించారు.
12న బీజేపీ
సభ్యత్వ నమోదు
కాజీపేట అర్బన్ : బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈనెల 12న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హంటర్‌రోడ్డులోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తెలిపారు. మంగళవారం స్థానికంగా జరిగిన హనుమకొండ, వరంగల్ జిల్లాల బీజేపీ ము ఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీధర్ మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంబునాథ్ తుండియా వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బన్న ప్రభాకర్, గడ్డం మహేందర్, జన్ను మధు, పోలేపాక మార్టిన్‌లూధర్, తాడెం రాజేందర్, మాదాసు రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment