కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా ప్రయాగ్‌రాజ్– ఎస్ ఎంవిటి బెంగళూరు–ప్రయాగ్‌రాజ్ మధ్య 12 స్పెషల్ రైళ్లు నడిపి స్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు
ప్రయాగ్‌రాజ్–ఎస్‌ఎంటివిటి బెంగళూరు(04131) ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం అక్టోబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 17వ తేదీ వరకు, ఎస్‌ఎంవిటి బెంగళూరు–ప్రయాగ్‌రాజ్ (04132) ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం అక్టోబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు అప్ అండ్ డౌన్ రూట్‌లో 12 రైళ్ల స ర్వీస్‌లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు తెలిపారు. అప్ అండ్ డౌన్ రూట్‌లో మానిక్‌పూర్, సంత, క ట్ని, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, బల్లార్షా, సి ర్పూర్‌కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నె ల్లూరు, గూడూరు, పెరంబుదూర్, కాట్‌పడి, జోలర్‌పెట్టయ్, కృష్ణరాజపురం రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు వారు మంగళవారం తెలిపారు.
ప్రయాగ్‌రాజ్–బెంగళూరు –
ప్రయాగ్‌రాజ్ మధ్య రాకపోకలు
Comments
Please login to add a commentAdd a comment