రైలు నుంచి పడి యువకుడి మృతి
కాశిబుగ్గ: రైలు నుంచి జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. జీఆర్పీ సీఐ సురేందర్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన షేక్ అల్లాబాగ్ష(33) కొన్ని సంవత్సరాలుగా వరంగల్ శివనగర్‌లో కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాం–2లో చింతల్ వైపు వస్తున్న బిలాస్‌పూర్ సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్(22620) నుంచి జారి పడి అక్కడికక్కడే మృతి చెందాదు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్‌ఎస్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పి.రాజు కేసు నమోదు చేసి మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి మృతుడి తల్లి బురాన్ భీకి అప్పగించామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment