● తహసీల్దార్‌తోపాటు
మరో నలుగురిపై కేసు
పర్వతగిరి : రైతు బతికి ఉండగానే చనిపోయినట్లు ధ్రువీకరణ చేసిన తహసీల్దార్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బోగం ప్రవీణ్ మంగళవారం తెలిపారు. 2023లో అజ్మీరా కోమి పర్వతగిరి తహసీల్దార్‌గా పనిచేశారు. ఈ క్రమంలో వడ్లకొండ గ్రామానికి చెందిన ఎర్రం మల్లయ్యకు చెందిన ఎకరం 25గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన తన బంధువు ఎర్రం దూడయ్యకు పట్టాచేశారు. తాను బతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరించి, పట్టా చేసిన అప్పటి తహసీల్దార్ కోమితోపాటు ఎర్రం దూడయ్య, సహకరించిన గ్రామస్తులు వెంకటేశ్వర్లు, రాజు, అప్సర్‌పాషాపై చర్యలు తీసుకోవాలని ఎర్రం మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment