ఆంతర్యమేమిటో
ఫార్మసీ కళాశాలల్లో తనిఖీల నివేదికలను వెల్లడించని అధికారులు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిఽ దిలో పలు ప్రైవేటు ఫార్మసీ కళాశాలల్లో అధికారుల తనిఖీలు చేపట్టారు. ఇందులో లోపాలు బహిర్గతమైనట్లు యూనివర్సిటీలో చర్చసాగుతోంది. అయి తే ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికలను వెల్ల డించకపోవడంతో ఆంతర్యమేమిటోనని పలు వురు ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం 2024–2025లో ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం అనుమతులు ఇచ్చేందుకు రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి గత నెలలో రెండు బృందాలను నియమించిన విషయం విధితమే. సీడీసీ డీన్ వి.రాంచంద్రం, ఫార్మసీ కళా శాల బీఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణవేణి, కేయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. ప్రసాద్ ఒక బృందంగాను, కేయూ అకడమిక్ డీన్ జి. హనుమంతు, కేయూ ఫార్మసీ కళాశాల డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య, సీనియర్ ప్రొఫెసర్ వై. నర్సింహారెడ్డి మరో బృందంగా నియమించారు. ఈ బృందాలు వేర్వేరుగా యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఖ మ్మం, ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, జనగామ జిల్లాల్లో మొత్తం 22 ఫార్మసీ కళాశాలలను గత నెల 21 నుంచి 24 వరకు తనిఖీ చేశాయి. ఫార్మసీ కళాశాలల్లో నిబంధనల మేరకు అధ్యాపకులు పనిచేస్తున్నారా? విద్యార్థులకు అవసరమైన కోర్సులకు అనుగుణంగా ల్యాబ్స్ ఎక్విప్‌మెంట్లు ఉ న్నా యా? లేవా? అనే విషయాలను పరిశీలించారు. ఎంఫార్మసీ , బీ ఫార్మసీ, ఫార్మ్–డి కోర్సులు నడ వాలంటే అందుకు సరిపడా ఫ్యాకల్టీ ముఖ్యం. ఫ్యా కల్టీ ఉందా? లేదా? అనే విషయం కూడా పరిశీ లించారని సమాచారం. అయితే పలు ఫార్మసీ కాలేజి ల్లో అప్పటికప్పుడు కొందరి అధ్యాపకులను చూ పినట్లు తనిఖీ బృందాలు గుర్తించాయని సమాచా రం. పలు కళాశాలల్లో సరైన ల్యాబ్స్ కూడా లేవనే విష యం కూడా గుర్తించినట్లు యూనివర్సిటీలో చర్చజరుగుతోంది. ఫార్మ్–డి కోర్సు నడవాలంటే 300 పడకలు కలిగిన ఏదైనా ఆస్పత్రితో ఎంఓయూ కలి గి ఉండాల్సింటుంది. కానీ పలు కళాశాలలకు ఆ వి ధంగా ఎంఓయూ లేదని వెల్లడైనట్లు సమాచారం.
ఎంఫార్మసీ కోర్సుకు
మూడు కళాశాలలకు అనుమతి నిరాకరణ..
తొలుత కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎం ఫా ర్మసీ కోర్సులకు అనుమతినిస్తూ ఇటీవలే రాష్ట్ర ఉన్న త విద్యామండలికి ఆయా ఫార్మసీ కళాశాలల జాబి తా పంపారు. అందులో ఖమ్మం జిల్లాకేంద్రంలోని మూడు ప్రైవేటు ఫార్మసీ కళాశాలలకు ఎం ఫార్మసీ కోర్సునకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడైంది. అక్కడి మూడు కళాశాలల్లో అధ్యాపకులు, ల్యాబ్ ఎక్విప్‌మెంట్లు సరిగా లేకపోవడంతోనే అనుమతి నిరాకరించినట్లు కాకతీయ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా మూడు కళాశాలల యాజమాన్యాలు కేయూ ఇన్‌చార్జ్ వీసీ వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో మరోసారి ఆయా మూడు ఫార్మసీ కళాశాలల తనిఖీకి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. తొలుత వెళ్లిన తనిఖీ బృందం కాకుండా రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి కొత్తగా బృందాన్ని నియమించారు. కేయూ ఫార్మసీ కళాశాలకు చెందిన ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒకరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో కూడిన మరో ముగ్గురి బృందంతో ఖమ్మంలోని ఆ మూడు ఫార్మసీ కళాశాలల్లో ఇటీవలే తనిఖీలు చేయించినట్లు సమాచారం. ఈ కమిటీ నివేదిక ఏ విధంగా ఇస్తుందనే విషయం చర్చగా ఉంది.
ఇంతలోనే సౌక్యర్యాలు ఏర్పాటు చేస్తారా?
ఒక బృందం తనిఖీ చేసిన రిపోర్టు ఆధారంగానే అనుమతులు నిరాకరించి మళ్లీ తనిఖీలు చేస్తే ఇంతలోనే ఆ మూడు ఫార్మసీ కళాశాలల్లో అధ్యాపకులు, ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తారా అనే అంశం చర్చగా ఉంది. యూనివర్సిటీ పరిధిలో వివిధ ఫార్మసీ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా నడపడం లేదని, ఫార్మసీ విద్య మిథ్యగామారిందనే విషయం అధికారులకు తెలిసినా తమకేమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
బీఫార్మసీ, ఫార్మ్–డి కోర్సుల అనుమతులేవి?
కేయూ పరిధిలో 22 ప్రైవేటు ఫార్మసీ కళాశాలలను ఆయా బృందాలు తనిఖీ చేసి రెండు వారాలు గడిచాయి. మూడు మినహా మిగతా కళాశాలలకు ఎంఫార్మసీ కోర్సులకు అనుమతిచ్చాయి. 22 ప్రైవేటు ఫార్మసీ కళాశాలల్లో ఎన్నింట్లో బీఫార్మసీ కోర్సులకు అనుమతిస్తున్నారనే అంశం, అలాగే ఫార్మ్–డి కోర్సులకు ఎన్ని కళాశాలలకు అనుమతినిస్తున్నారనే విషయంపై ఇప్పటి వరకు తనిఖీ బృందాల నివేదిక బయటకు వెల్లడించలేదు. ఏఏ కళాశాలలకు బీఫార్మసీ, ఫార్మ్–డి కోర్సుల్లో ఎన్నీ సీట్లు ఇస్తున్నారనే విషయం వెల్లడించకుండా సంబంధిత యూనివర్సిటీ అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులు అనుమతుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది కూడా ప్రైవేటు ఫార్మసీ కళాశాలల యాజామాన్యాలు ఉత్కంఠగా నిరీక్షిస్తున్నాయి. రెండు తనిఖీ బృందాలు తనిఖీచేశాక ఉన్నది ఉన్నట్లు రి పో ర్టు రూపొందించి కూడా అనుమతుల ఇవ్వడంలో జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటీ అనేది యూనివర్సిటీలో చర్చగా మారింది.
కేయూ పరిధిలో గతంలో మూడు కళాశాలలకు ‘ఎం ఫార్మసీ’ కోర్సుకు అనుమతికి నిరాకరణ
ఆ మూడింట్లో మరోసారి తనిఖీలు
చేపట్టిన అధికారుల బృందం
ఉన్నది ఉన్నట్లు రిపోర్టు
రూపొందించొచ్చు కదా అని
ప్రశ్నిస్తున్న పలువురు
Comments
Please login to add a commentAdd a comment