పరిశోధన పత్రం సమర్పణ
కేయూ క్యాంపస్ : చైన్నెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు ప్రతిష్టాత్మక 18వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ థర్మల్ ఎనాలిసిస్ అండ్ కాలోరమెట్రీ 2024 సదస్సు జరిగింది. ఇందులో కేయూ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ సవితాజ్యోత్స్న పాల్గొని పరిశోధన పత్రం సమర్పించారు. అలాగే ఒక టెక్నికల్ సెషన్‌లోనూ పాల్గొన్నారు.
క్షణికావేశం..
● తమ్ముడిని స్క్రూడ్రైవర్‌తో పొడిచిన అన్న
● పరిస్థితి విషమం..ఎంజీఎంకు తరలింపు
నర్సంపేట రూరల్: తన మాటలు వినడం లేదనే క్షణికావేశంలో అన్న.. తమ్ముడిని స్క్రూ డ్రైవర్‌తో పొడిచాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం నర్సంపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేటలోని రాంనగర్ కాలనీకి చెందిన దొడ్డ దేవేందర్, అమరేందర్ అన్నదమ్ములు. కొన్ని నెలల క్రితమే వీరి తల్లిదండ్రులు మృతిచెందారు. వీరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే తన మాటలు విన డం లేదనే కారణంపై దేవేందర్, అమరేందర్ మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. దీంతో క్షణికావేశానికి లోనైనా దేవేందర్ తమ్ముడు అమరేందర్‌ను స్క్రూడ్రైవర్‌తో పొట్టలో పొడిచాడు. స్థానికులు గమనించి నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఎంజీఎంకు రెఫర్ చేశారు. ఈ ఘటనపై నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తిని వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి
మామునూరు: పాడి పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ రాజన్న అన్నారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం భవనంలో పశువైద్య శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మంగళవారం శాసీ్త్రయ పద్ధతిలో పాడి పశువుల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పాడిపశువుల పెంపకం, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వర్షాకాలం, చలికాలంలో చూడి పశువుల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఒత్తిడితో అనేక రకాల రోగాలకు గురవుతుంటాయని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శశాంక్, సాయికిరణ్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment