వరద బాధితులకు ప్రభుత్వం అండ
తొర్రూరు రూరల్: వరద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన వర్షానికి వరదలో పడి మృతి చెందిన మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల నర్సయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5 లక్షల చెక్కును మంగళవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సోమరాజశేఖర్, మంగళపెల్లి రామచంద్రయ్య, పెదగాని సోమయ్య, చిత్తలూరి శ్రీనివాస్, మేరుగు మల్లేశంగౌడ్, మొగుళ్ల లింగన్న, వెంకన్న, మల్లయ్య, హుస్సేన్ పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే
మామిడాల యశస్వినిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment