వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఇవ్వొద్దు..మద్యం తాగించొద్దు
కేసముద్రం: వచ్చే సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, గ్రామ ఓటర్లకు డబ్బులు ఇవ్వొద్దు, మద్యం తాగించొద్దు అంటూ మండలంలోని బిచ్యానాయక్‌తండా జీపీ శివారు రాజీవ్‌నగర్ తండాలో గ్రామ కమిటీ కుర్రాళ్లు పేరిట గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ విషయం చర్చనీయాంశమైంది. ‘అభ్యర్థులు ఎలక్షన్‌లో పోటీచేస్తే చేయండి.. కానీ ఓటర్లకు డబ్బులు ఇవ్వడం, మీ వెంట తిప్పి మద్యం తాపించి, తినిపించి గ్రామప్రజలను తాగుబోతులుగా మార్చకండి. నిజాయితీగా మీ రాజకీయాలు చేసుకోండి.. అంతలా డబ్బులు ఖర్చు చేయాలనిపిస్తే గ్రామంలో ఏదైనా మంచిపని చేసి చూపించండి. కాదు కూడదని మీరు ఊరిని ఆగం చేయాలని చూస్తే ఏ మాత్రం సహించేదిలేదని, ఆధారాలు సేకరించి పోలీసులకు పట్టిస్తాం జాగ్రత్త’ అంటూ ఫ్లెక్సీపై హెచ్చరిక పేరిట ప్రింట్ చేయించారు. ఈ ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిచ్చానాయక్‌తండా జీపీలో ఫ్లెక్సీ ఏర్పాటు
చర్చనీయాంశమైన ఘటన
Comments
Please login to add a commentAdd a comment