అధికారులు స్పందించకపోతే చెప్పండి
దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
కొండా సురేఖ
కాశిబుగ్గ/ఖిలా వరంగల్/కాజీపేట అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు స్పందించకపోతే తనకు చెప్పాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. ఓ సిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండో రోజు మంగళవారం మంత్రి కొండా సురేఖ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రేటర్ 34వ డివిజన్ శివనగర్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో రూ.35లక్షల నిధులతో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా 31వ డివిన్ పరిధిలోని దోనే గుట్టలో మంగళవారం కార్తీకమాసం సందర్భంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని పేర్కొన్నారు. పురాతన దేవాలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. న్యూశాయంపేటలోని శ్రీ త్రివేదాద్రి సంతోషలక్ష్మీనరసింహస్వామి దేవా లయ అభివృద్ధికి బల్దియా జనరల్ నిధుల నుంచి రూ.54 లక్షలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీపద్మ, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శ్రీరాం రాజేశ్, వడ్నాల మ ల్లయ్య, మంచాల కృష్ణమూర్తి, చింతం యాదగిరి, బుధారపు భాస్కర్, ఆడెపు సాంబమూర్తి, రాజమౌళి, బత్తుల నవీన్, పగడాల సతీశ్, లావణ్య, మోహన్‌రావు, కృష్ణ, వేణు, యాదగిరి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment