రైల్వే ఇంజనీరింగ్ బ్లాక్‌తో పలు రైళ్ల రద్దు
రేపటి నుంచి జనవరి 9వ తేదీ వరకు..
కాజీపేట రూరల్ : వరంగల్–విజయవాడ మధ్య మోట మర్రి సెక్షన్‌లో మూడో రైల్వే లైన్, ఇంజనీరింగ్ బ్లాక్‌తో ఈ నెల 25వ తేదీ (రేపటి) నుంచి 2025 జనవరి 9వ తేదీ వరకు కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్లు కాజీపేట రైల్వే అధికారులు సోమవారం తెలిపారు.
రద్దయిన రైళ్ల వివరాలు..
ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు కాజీపేట–డోర్నకల్ (07753) ప్యాసింజర్, డోర్నకల్–కాజీపేట (07754) ప్యాసింజర్, డోర్నకల్–విజయవాడ (07755) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (07756) ప్యాసింజర్, విజయవాడ–భద్రాచలంరోడ్ (07979) ప్యాసింజర్,భద్రాచలంరోడ్–విజయవాడ (07 278) ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి.
28వ తేదీ నుంచి మరికొన్ని రైళ్లు..
ఈ నెల 28 నుంచి జనవరి 9వ తేదీ వరకు గుంటూరు–సికింద్రాబాద్ (12705) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (12706) ఎక్స్‌ప్రెస్, విజయవాడ–సికింద్రాబాద్ (12713) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విజయవాడ (1271 4) రైళ్లు రద్దయ్యాయి. ఇవే కాకుండా కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే మొత్తం 28 రైళ్లు రద్దు, 23 రైళ్లు దారిమళ్లింపు, 3 రైళ్లు రీషెడ్యూల్, కాజీపేట, వరంగల్‌లో 14 రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ ఎత్తివేత, 2 రైళ్లను పార్శిల్లీ రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
వరంగల్ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు
వరంగల్: క్రిస్మస్ సందర్భగా వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు ఉందని, ఈ సమయంలో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీ క్రిస్మస్, 26వ తేదీ బాక్సింగ్ డే ఉన్న నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. ఈవిషయాన్ని రైతులు, వ్యాపారులు గమనించి తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావొద్దని తెలిపారు.
పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించాలి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో తమకు పీహెచ్‌డీలో అడ్మిషన్లు కల్పించాలని డి మాండ్ చేస్తూ ముగ్గురు అభ్యర్థులు మంద నరేశ్, ఎస్.అనిల్, మాలోత్ తిరుపతి నాయక్ సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మల్లారెడ్డితో వాగ్వాదానికి దిగారు. పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ త మ పరిధిలో లేదని మల్లారెడ్డి పేర్కొన్నారు. అ నంతరం ముగ్గురు అభ్యర్థులు వీసీ చాంబర్‌లో ఆమరణ దీక్షకు దిగారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఆ అ భ్యర్థులతో మాట్లాడారు. ఇప్పుడు పీహెచ్‌డీ అ డ్మిషన్లు కల్పించడం తన చేతిలోలేదన్నారు. ఉన్నత విద్యశాఖ నుంచి అనుమతి తెచ్చుకుంటేనే అవకాశం ఉంటుందన్నారు. అయితే త మకు అడ్మిషన్లు కల్పించాల్సిందేనని పట్టుబ డుతూ నిరసన తెలిపారు. దీంతో కేయూ సీఐ రవికుమార్, ఎస్సై రవీందర్ ఘటనాస్థలికి చేరుకుని అభ్యర్థులను బయటకు తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment