● మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క
ములుగు: ఒక స్మగ్లర్ పోలీసును బట్టలు విప్పి నిలబెడితే జాతీయ అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం.. స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసులను విలన్ చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ములుగులో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు. సినిమా హాల్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనను ఆసరాగా తీసుకొని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం బీఆర్‌ఎస్ ముసుగులో సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వి కొంతమంది రాద్ధాంతం చేయజూస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అల్లు అర్జున్‌పై తమకు ఎలాంటి కోపం లేదన్నారు. లంగతనాలు, దొంగతనాలపై తీసే సినిమాలపై ఎవరూ సానుకూలంగా స్పందించరని, తెలుగు సినీ ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చూడడం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment